ప్రేక్షక టాలీవుడ్: అరవింద... రాఘవకు చెప్పు సీమ ఏడుస్తుంది...!

VUYYURU SUBHASH
టాలీవుడ్ లో నందమూరి వంశానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ వంశంలో సీనియర్ ఎన్టీఆర్ దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేశారు. ఆ తర్వాత ఆయన నట వారసుడిగా వచ్చిన ఆయన కుమారుడు యువరత్న నందమూరి బాలకృష్ణ సైతం మూడు దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఇదే నందమూరి వంశం నుంచి మూడోతరం హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆయనను అఖిల తెలుగు ప్రేక్షకులు మళ్లీ నందమూరి తారక రాముడు వచ్చాడు రా అని గుండెల్లో పెట్టుకున్నారు.
అందుకే ఎన్టీఆర్ కెరీర్ చిన్నవయసులోనే స్టూడెంట్ నెంబర్ వన్ - ఆది - సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది. ఆయ‌న కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కు ఉత్తరాంధ్ర నుంచి గోదావరి కాపు ల లోనూ - కృష్ణా , గుంటూరు క‌మ్మ‌ల‌ లోనూ - నెల్లూరు , ప్రకాశం రెడ్ల లోనూ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే రాయలసీమ లో ఎన్టీఆర్ కు తిరుగులేని మార్కెట్ ఉంది. ఆయన నటించిన అరవింద సమేత వీర రాఘవ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోనే తెరకెక్కింది.
తన సినిమాలకు రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు అదే రాయ‌ల‌సీమ‌ వరదలతో తల్లడిల్లుతూ ఉంటే మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే స్పందించే ఎన్టీఆర్ రాయ‌ల సీమ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్టీఆర్ త‌న అభిమానుల‌కు ఒక్క పిలుపు ఇస్తే సీమ జ‌నాల‌కు ఉన్నంత లో కొంత వ‌ర‌కు అయినా సాయం చేస్తారు గా ? ఈ విష‌యం పై ఎన్టీఆర్ మౌనంగా ఉండడంపై సోష‌ల్ మీడియాలో చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఎప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: