బాలయ్య పై ఆసక్తి కర కామెంట్ చేసిన థమన్...!

murali krishna
నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని అందరికి తెలుసు.

ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారట.బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారని తెలుస్తుంది.అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారని తెలుస్తుంది... ఆయన మాట్లాడుతూ.. కరోనా కంటే ముందే రావాల్సిన సినిమాలు ఇప్పుడు అన్నీ వరుసపెట్టి వచ్చేస్తున్నాయని బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి అండర్ స్టాండింగ్ చాలా గొప్పదని వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు అన్నారట. కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయట.. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చానని విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలని .అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశానని చెప్పుకొచ్చాడట ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుందని మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారని మా అందరినీ పరిగెత్తించారు అన్నారట.

ఈ సినిమాలో ఫైర్ ఉందని ఇందులో ఎమోషన్ బాగుంటుందని ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయని బాలయ్య గారు అదరగొట్టేశారని చెప్పుకొచ్చారట ఇది పర్ఫెక్ట్ మీల్‌లాంటి సినిమా అని అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశానని చెప్పారట ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టామని చాలా బాగా వచ్చిందని చెప్పారట. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చట. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారట.కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుందట కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు అని తమన్ చెప్పుకొచ్చారట.

మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలేనని వారి వల్లే అందరికీ రీచ్ అవుతుందని ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవని చెప్పారట.థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారని ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుందని చెప్పారట.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చేయడం చాలా కొత్త ఉందని సపరేట్‌గా ఇద్దరికి పని చేయడం వేరే ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరని ఇది వేరే ఫైర్ అని అన్నారట.ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారట.చాలా ప్రయోగాలు చేశారట కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారట. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశారట. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోందని వేరే జోన్‌లో ఉంటుందట.. బాలయ్య గారితో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తున్నానని ఆయన చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: