ఆచార్య సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుంది..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా ల్లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య సినిమా లో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది,  ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది, ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన  పోస్టర్ లను, టీజర్ లను, రెండు లిరికల్ సాంగ్ వీడియో లను  చిత్ర బృందం విడుదల చేయగా  వాటికి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ వస్తోంది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లపై చిత్రీ కరించిన నీలాంబరి లిరికల్ వీడియో సాంగ్ లో చిత్ర బృందం బయటకు వదిలింది, ఈ పాట కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే ఆచార్య చిత్ర బృందం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది, అయితే మరి కొద్ది రోజు ల్లో రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజు ల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: