సమంత కెరీర్ ప్లానింగ్ మామూలుగా లేదే!!

P.Nishanth Kumar
విడాకుల తర్వాత తన సినిమా కెరీర్ ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. ఇప్పటి వరకు ఆమె తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసి సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాపులర్ హీరోయిన్ గా నిలిచింది. అందాల విషయంలో ఏ విధంగానూ తగ్గేదేలే అంటూ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించింది ఆమె. సోషల్ మీడియాలో ఎవరు పెట్టని విధంగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

 ఇక ఆమె ఇటీవలే తన భర్త అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈమె గురించి పలురకాల వార్తలు విడాకుల గురించి రాగా ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. సమంత కూడా మంచి సినిమాలు చేసే విధంగా ముందుకు పోతుంది. చైతు తో విడాకుల అనంతరం మన ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన సమంత ఆ తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయిపోయింది.

ఇంతకు ముందు కంటే ఎంతో యాక్టిివ్ గా ఆమె పోస్ట్ లు పెడుతుంది. ఆ మధ్య ఆమె చైతు తో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేసి సంచనలం సృష్టించింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా పూర్తి చేయగా మరోవైపు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మరియు డ్రీమ్ వారియర్స్ వారి నిర్మాణంలో రెండు సినిమాలను చేస్తుంది. అంతే కాకుండా ఆమె వెబ్ సిరీస్ లు చేయడంలో కూడా ముందు ఉంటుంది. ఇంత జరిగిన కూడా ఆమెకు నిర్మాతలు అడిగినంత పారితోషకం ఇవ్వడం విశేషం. మరి విడాకుల తర్వాత ఆమె కెరీర్ ఏ స్థాయి లో ఎదుగుతుండో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: