బిగ్ బాస్ 5 : కూల్ గా ఉండే శ్రీరామ్.. ఫైర్?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో గా కొనసాగుతుంది బిగ్బాస్ కార్యక్రమము. అటు తెలుగు బుల్లితెరపై కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రతి సీజన్ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం కూడా బుల్లితెర  ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ఇక బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారో అన్న విషయం పై ఆసక్తికర చర్చ మొదలైంది.

 అయితే 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కేవలం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఎనిమిది మందిలో టాప్ లో ఎవరు నిలవ పోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండడంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో పోటీ మరింత ఎక్కువ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో  గేమ్ ఆడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే బిగ్ బాస్ షో కాస్త బుల్లితెరపై మరింత క్రేజ్ సంపాదించుకుంటు దూసుకుపోతుంది. ఇక ఇటీవలే నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే.

 ఇదిలా ఉంటే ఇక ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కూడా మొదలైపోయింది. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ప్రస్తుతం ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా హోరాహోరీగా పోటీ పడుతూ ఉండటం గమనార్హం. అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఎంతో కూల్గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సింగర్ శ్రీరామచంద్ర. కానీ ఇటీవలే బిగ్బాస్ హౌస్ నుంచి అని మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం  ఒక్కసారిగా శ్రీ రామచంద్ర ఫైర్ అవుతున్నాడు. అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి కారణమైన కాజల్ తో తరచూ గొడవలు పెట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన ప్రోమో లో కూడా శ్రీ రామచంద్ర ఎంతో కోపంగా  మరోసారి కాజల్ తో గొడవ పడటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: