విడిపోతున్న సినీ ప్రేమజంటలు.. షాక్ లో అభిమానులు?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. కొంతమంది సినిమా హీరోయిన్లు ఇక సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళ తో ప్రేమాయణం నడుపుతు ఉంటే మరి కొంత మంది మాత్రం ఏకంగా సినిమా హీరోల తోనే ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు.  అయితే కొంతమంది కేవలం ప్రేమతో మాత్రమే సరిపెట్టుకుంటూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఇక ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటి అవుతూ ఉంటారు. ఇలా ఎప్పుడు వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమ వివాహం చేసుకున్నారు.  ప్రేమ వివాహం చేసుకున్న జంటలు ఎక్కడైనా కనిపిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు.

 ఇలాంటి సినీ ప్రేమజంటలు గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్టు సమంత ప్రకటించి సంచలనం సృష్టించింది. తెలుగుప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ జంట ఉన్నపలంగా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దానిపై మాత్రం ఇప్పటికీ అభిమానులకు ఒక చిక్కు వీడని ప్రశ్న గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా సమంత నాగచైతన్య విడాకుల గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ని మార్చింది ప్రియాంక చోప్రా. మొన్నటివరకు ప్రియాంక చోప్రా జోనాస్ గా పేరు ఉండగా ఇక ఎప్పుడూ తన భర్త పేరును తొలగించి ప్రియాంక చోప్రా అంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్ పేరు ని మార్చింది. దీంతో ఇక ప్రియాంక చోప్రా కూడా భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు మొదలయ్యాయి. అయితే ఇక అటు బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నజోనాస్ జంటకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇలా వరుసగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహం చేసుకున్న జంటలు విడాకులకు సిద్ధమవుతు వుండడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా సినీ ప్రేమ జంటలు ఎందుకు విడిపోతున్నాయి అనేదే అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: