అలాంటివి ఏర్పాటు చేయడమే తన లక్ష్యం అంటున్న సుధీర్..!!

Divya
సుడిగాలి సుధీర్.. ఈ పేరు వింటేనే చాలు ఆయన అభిమానులకు ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంటుంది. ఇకపోతే బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో లో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం వెనుక సుధీర్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుంటే కన్నీళ్లాగవు. తాజాగా తన కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేకాదు తన లక్ష్యం ఏంటో తెలుపుతూ ఆ లక్ష్యం వైపు పయనిస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు.. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ ఇలా చెప్పుకొచ్చాడు.
2022 ఫిబ్రవరి నాటికి జబర్దస్త్ షో కి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతాయని, ప్రజలకు హాస్యాన్ని తెప్పించాలనే ఆరాటం తోనే ఇన్ని సంవత్సరాల పాటు ఒకే స్టేజి పైన నటిస్తున్నాను అంటూ తెలిపాడు. ఇకపోతే స్కిట్ లో  శీను ఒక మంచి లైన్ చెబితే,  రాంప్రసాద్ రాసుకుంటూ పోతాడు.. అందులో నా పని చాలా తక్కువ.. కేవలం నా ఆలోచనలు మాత్రమే వారితో పంచుకుంటానని సుధీర్ తెలిపాడు.. అంతేకాదు తన కెరీర్ కు రష్మి ఎంతగానో సహాయ పడింది అని కూడా తెలిపాడు.. రష్మితో నడిపిన లవ్ ట్రాక్ వల్లే తమకు బాగా పేరు వచ్చిందని సుధీర్ తెలపడం గమనార్హం.
గెటప్ శీను, రాంప్రసాద్ ఫ్రెండ్స్ కంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి ఉంటామని, రష్మీ కూడా ఒక మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపాడు. జబర్దస్త్ లోకి రాకముందే గెటప్ శ్రీను, సుదీర్ కు మంచి స్నేహితుడు అట. వేణుకు గెటప్ శ్రీను.. సుధీర్ ని పరిచయం చేసి , ఆ తర్వాత రాంప్రసాద్ పరిచయం అయ్యాడట. ఇక వీరు ముగ్గురు కలిసి కమెడియన్ వేణు వల్లే జబర్దస్త్ లో నిలదొక్కుకోగలిగామని తెలిపారు. కష్టాలు ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది అని భోజనానికి డబ్బులు లేక సింకు లోని నీళ్లు తాగి బతికిన రోజులు కూడా ఉన్నాయని తెలిపాడు.
అయితే తన లక్ష్యం ఒకటేనని.. అనాధ ఆశ్రమాలు.. ఓల్డ్ ఏజ్ హోమ్ లను ఎప్పటికైనా ఏర్పాటు చేసి,  నాలాగా ఎవరూ ఇబ్బంది పడకుండా చేయడమే నా లక్ష్యం అంటూ తెలిపాడు సుధీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: