ఎన్టీఆర్ సినిమాతో పోటీపడిన సినిమాల పరిస్థితి ఏంటో చూద్దామా..??

N.ANJI
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలో మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను పాత మోటారు బైక్స్, వాహనాలను జారీచేయడంతో పాటు మనుషుల్లో కుళ్ళును కూడా తొలగించే పాత్రలో మోహన్ లాల్, ప్రకృతిలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా, నిత్యా మీనన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2016 సెప్టెంబర్ 1న రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 130కోట్లు వసూలు చేశారు. ఈ సినిమాకి  రెండు వారాల ముందు ఆగస్టు 19న చుట్టాలబ్బాయి మూవీ విడుదలైంది. ఈ సినిమాలో సాయికుమార్ హీరోగా చేసిన ఈ మూవీ ఏవరేజ్ రాణించింది.
ఆ తరువత ఆగస్టు 19నే సుశాంత్ హీరోగా నటించిన ఆటాడుకుందాం రా మూవీ విడుదలైంది. ఈ సినిమాకి జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక  సుడిగాలి సుధీర్, దీక్షా, ధనరాజ్, షకలక శంకర్ తదితరులు నటించిన బంతిపూల జానకి సినిమా పరాజయం అందుకుంది. అలాగే అవసరానికి అబద్ధం సినిమా విడుదలై నిరాశ కలిగించింది. ఇక దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ నటించిన 100డేస్ తమిళ రీమేక్ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అలాగే.. సెప్టెంబర్ 8న విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇంకొక్కడు సినిమా విడుదలైంది. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా వచ్చిన జ్యో అచ్యుతానంద మూవీ సెప్టెంబర్ 9న  విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ సినిమా విడుదలైన సక్సెస్ అందుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: