చిరు కు పోటీగా మరో హీరో.. ఇప్పుడెలా!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో తెలుగులో పెద్ద హీరోల సినిమాలతో పాటు తమిళ హీరోల సినిమాలు ఒకే కాలంలో విడుదల చేస్తూ వారికి మంచి పోటీని ఇస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ విధంగా తమిళంలో స్టార్ హీరోల గా ఉన్న పెద్ద హీరోల సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతూ మంచి మార్కెట్ ను సంపాదించుకుంటున్నారు. ఇక తాజాగా మరొకసారి తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా విడుదల అవుతున్న వేళ ఓ తమిళ స్టార్ హీరో తన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ చిత్రం విడుదల ఇప్పటివరకు పలుమార్లు వాయిదా పడుతూ రాగా ఎట్టకేలకు ఫిబ్రవరి లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ విధంగా ఫిబ్రవరిలో సోలోగా తమ సినిమాలను విడుదల చేయాలని చిరంజీవి భావించగా ఇప్పుడు పోటీగా తమిళనాట స్టార్ హీరోగా ఉన్న సూర్య తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. దాంతో చిరంజీవికి ఓ అడ్డుతగిలిన టు అయింది.

ఇటీవల తన రెండు సినిమాలతో సూపర్ హిట్ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు సూర్య. ఆకాశమే నీ హద్దురా అలాగే జై భీమ్ చిత్రాలు రెండూ కూడా ఓటిటీ లో విడుదలవ్వగా అవి సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో తన తదుపరి చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేయాలని భావించిన ఆయన పాండిరాజ్ దర్శకత్వం లో ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. మొదటినుంచి తెలుగులో తన సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నాడు. తమిళనాడు లో స్టార్ హీరోగా ఉన్న ఆయన తెలుగులో కూడా మంచి హీరోగా ఉండగా ఇప్పుడు ఈ సినిమా తో చిరంజీవి సినిమా కి పోటీ గా రావడం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: