కేజిఎఫ్ తో తలపడనున్న అమీర్ ఖాన్..!

Pulgam Srinivas
యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ వన్ ఈ సినిమా చాలా సైలెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే, అయితే ఈ సినిమాకు కొనసాగింపు గా కే జి ఎఫ్ చాప్టర్ టు తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను చిత్ర బృందం బయటకు వదలగా దీనికి పాన్  ఇండియా రేంజ్ లో అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల ఆలస్యం అవుతూ వస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 14 ఏప్రిల్ 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం తెలియజేసింది.

అయితే తాజాగా మరో భారీ చిత్రం ఈ సినిమా విడుదల తేదీ రోజే విడుదల కావడానికి సిద్దం అయ్యింది. అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని నాగచైతన్య ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలు క్రిస్ మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలియజేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14 వ తేదీకి మార్చారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాను 14 ఏప్రిల్ 2022 లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు తలపడనున్నాయి. మరి ఇలా రెండు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల ఏదో ఒక సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ మూవీ మేకర్స్ చెప్పిన తేదీ లకే ఈ సినిమాలను విడుదల చేస్తారా..? లేక  ఎవరైనా తమ సినిమా విడుదల తేదీలను మార్చుకుంటారా..? తెలియాలంటే  మరి కొద్ది కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: