నాగచైతన్య వెబ్ సీరీస్ లో తమిళ బ్యూటీ..!!

Anilkumar
ప్రస్తుతం డిజిటల్ రంగానికి జనాల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందాయి. ఓటీటీ లో సినిమాలు విడుదల చేయడమే కాకుండా.. స్టార్ హీరో ఇంకా హీరోయిన్లు ఓటిటి ప్లాట్ఫామ్ వేదికగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తమదైన శైలిలో గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగిటివ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ లో నాగచైతన్య నటిస్తున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం ఎవరు నటిస్తున్నారో తెలియదు. అయితే తాజాగా హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్న క్రమంలో లో తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ని ఎంపిక చేసారట. ఇటీవల ఎంపిక చేసినట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న థాంక్యూ సినిమా పనులు పూర్తి కాకముందే చైతన్య  ఇంకా ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్ వెబ్ సిరీస్ గురించి ప్రకటించేశారు.

 అయితే ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమా ఒక్కటే కాకుండా సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా  ప్రేక్షకుల ముందుకు నున్న బంగార్రాజు  సినిమాలో కూడా తన తండ్రి నాగార్జునతో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే విడుదల తేదీపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతుకు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె పస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ని కనబరిచిన సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: