ఎన్టీఆర్ ను ఎందుకిలా వెనక్కి పడేలా చేస్తున్నారు

P.Nishanth Kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఉండగా జనవరి 7 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
హీరోగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ కు అభిమానులు కోట్లాది మంది ఏర్పరుచుకున్నారు. నందమూరి నట వారసుడిగా హీరో గా తెరంగేట్రం చేసి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా లో చేస్తున్నప్పటి నుంచి ఆయన కెరియర్ ఎందుకో వెనక పడినట్లుగా ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్ దే పై చేయి కావడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ తక్కువ అయి నట్లుగా అందరూ భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆయన సోలో హీరోగా చేసే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ ప్రశాంత్ నీల్ వంటి భారీ దర్శకుల సినిమాలను చేసుకోబోతున్న ఎన్టీఆర్ ఆయా సినిమా లతో ఏ రేంజ్ లో విజయం సాధిస్తాడో చూడాలి.ఎన్టీఆర్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఇక అభిమానులను కూడా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువమందిని సంపాదించాడని చెప్పుకోవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు సరికొత్త కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సారి కూడా ఎలాంటి కథతో వస్తాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: