ట్రైనర్ గురించి చెప్పి ఏడ్చేసిన ఇలియానా..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఇలియానా తన హాట్ హాట్ అందాలతో, నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇలా మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందుకున్న ఇలియానకు టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ పోకిరి, జల్సా, ఆట, శక్తి, మున్నా, ఖతర్నాక్ వంటి చిత్రాలలో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయం లోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దు గుమ్మకు అక్కడ మాత్రం ఆశించిన విజయాలు అందలేదు. ఆ తర్వాత మళ్లీ రవితేజ హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా మరొక సారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

కాకపోతే ఈ సినిమా కూడా నిరాశపరచడంతో ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇలా ఇది ఉంటే ఇలియానా మాత్రం ఫిట్నెస్ మీద చాలా దృష్టి పెడుతూ ఉంటుంది. నిత్యం వర్కౌట్ లు చేస్తూ ఇలియానా బిజీగా ఉంటుంది. తాజాగా హాట్ బ్యూటీ ఇలియానా తన వర్కవుట్ల గురించి,ట్రైనర్ గురించి చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది. ఇలాంటి ఘటన ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. వర్కౌట్ లు పూర్తి అయిన తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాను. కన్నీళ్లు కూడా వచ్చాయి. ఎందుకు అంటే.. ఇప్పుడు చేతులు నీ దగ్గర పెట్టుకుని నీ బాడి గురించి నువ్ ఆలోచించుకో.. నీ కోసం నీ శరీరం ఎంత కష్టపడుతోందో దానిని ఫీల్ అవ్వు అని ట్రైనర్ చెప్పాడు. అవును ఆ విషయం నిజమే కదా , అని అనిపించింది. అలా చేసిన తరువాత నా శారీరం గురించి నేను ఆలోచించుకున్నాక ఎంతో సంతోషం వేసింది. మీరు కూడా ఒకసారి అలా చూసుకోండి అని హాట్ బ్యూటీ ఇలియానా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: