బరువు తగ్గడానికి అంతలా ప్రయత్నం చేస్తున్న అనుష్క శెట్టి..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనుష్క శెట్టి నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఇలా మొదటి సినిమాలోనే తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అనుష్క ఆ తర్వాత తెలుగు నాట స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. కేవలం కమర్షియల్ సినిమాలలో అంద చందాలను ఓలకపోవడం మాత్రమే కాకుండా అనుష్క శెట్టి అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి స్టార్ హీరోలకు నేనేమి తక్కువ కాదు అని నిరూపించుకుంది. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన బాహుబలి సినిమాతో అనుష్క ఇండియా వైడ్ గా పాపులారిటీని పెంచుకుంది. కాకపోతే బాహుబలి సినిమా చేసే టైం లోనే అనుష్క జీరో సైజ్ అనే సినిమా కోసం బరువు పెరుగుతుంది. ఆ తర్వాత బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. అయితే అనుష్క చివరగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా అనుష్క కాస్త లావుగానే కనిపించింది. అయితే తాజాగా అనుష్క యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాలో ఒక సినిమాలో నటించబోతుంది. అయితే ఆ సినిమా కోసం అనుష్క సన్నగా, నాజూకుగా తయారవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందట. అందుకోసం అనుష్క ఆరు రకాల చిట్కాలను పాటిస్తుందట అవి..
 
మొదటి చిట్కా  : ఎక్కువ నీళ్లను తాగడం మరియు మధ్యలో టెంకాయ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుందట.
రెండవ చిట్కా : అనుష్క తన ఆహారంలో ఎక్కువగా కూరగాయలు తీసుకుంటుందట, ఎక్కువగా ఫైబర్ ఉండే కూరగాయలకు అనుష్క ప్రాధాన్యత ఇస్తుందట.
మూడవ చిట్కా : భోజనాన్ని మూడు పూటలు కాకుండా  నాలుగు, అయిదు పాటల్లో తీసుకుంటుందట.
నాలుగవ చిట్కా : రాత్రి 8 గంటల లోపే అనుష్క తన డిన్నర్ ను పూర్తి చేసుకుంటుందట.
అయిదవ చిట్కా : ఆయిల్ లేకుండా అనుష్క ఇంటి భోజనాన్ని తీసుకుంటుందట.
ఆరవ చిట్కా : ఆహారంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజులు, యోగా చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: