మొన్నటివరకు జబర్దస్త్.. ఇప్పుడు ఢీ లోకి కూడా రోజా?

praveen
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం అదిరిపోయే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై వివిధ చానళ్లలో ఎన్నో కామెడీ కార్యక్రమాలు వస్తున్నప్పటికీ జబర్దస్త్ కు మాత్రం బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ కాస్త ఉపశమనం పొందడానికి.. హాయిగా నవ్వు కోడానికి అటు జబర్దస్త్ ని మాత్రమే చూస్తారు అని చెప్పాలి. ఇలా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకొని.. ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకొని దూసుకు పోతుంది జబర్దస్త్ కార్యక్రమం. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో విజయవంతమైన కామెడీ షోగా కొనసాగుతోంది.

 అయితే జబర్దస్త్ కార్యక్రమం లో భాగంగా ఒకప్పుడు నాగబాబు రోజా జడ్జ్ గా ఉండేవారు. కానీ ఆ తర్వాత నాగబాబు ఇక జబర్దస్త్ జడ్జ్ గా తప్పుకోవడంతో  నాగబాబు స్థానంలో సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్ గా వచ్చారు. కానీ రోజా మాత్రం జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జిగా కొనసాగుతున్నారు. అయితే ఇక ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి స్మైల్ క్వీన్ గా మారిపోయింది రోజా. ఇక రోజా చెప్పిందే వేదం అన్న విధంగా జబర్దస్త్ కార్య క్రమంలో మారిపోయింది. ఇలా ఎప్పుడైనా రోజా బిజీగా ఉంటే జబర్దస్త్ కి కొన్ని రోజులపాటు బ్రేక్ఇస్తుంది తప్ప ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రోజాజడ్జిగా తప్పుకోలేదు.

 అయితే ఇప్పుడు ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లో జడ్జిగా అలరిస్తున్న రోజా ఇటీవలే డాన్స్ రియాలిటీ షో ఢీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అభిమానులందరినీ కూడా ఆశ్చర్య పరిచింది. ఢీ షో లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు ఇక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది రోజా. ఇక ఆ తర్వాత స్పెషల్ గెస్ట్ ప్లేస్ లో కూర్చొని కంటెస్టెంట్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి మురిసిపోయింది. ఇక రోజా పుట్టిన రోజు సందర్భంగా రోజాకు గిఫ్ట్ ఇచ్చే విధంగా రోజా సినిమా లోని కొన్ని పాటలుపై ఢీ కంటెస్టెంట్స్ డాన్స్ చేయగా చివరగా రోజా తో కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఇలా జబర్దస్త్ జడ్జి రోజా డాన్స్ రియాలిటీ షో డీ లోకి రావడం మాత్రం అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: