అల్లు అర్జున్ కు.. తన పిల్లలపై ఉన్నడ్రీమ్ ఇదీ..?

NAGARJUNA NAKKA
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందుకోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కొడుకు అకీరా నందన్‌ తెరంగేట్రం గురించి చారా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ వీళ్ల ఫస్ట్‌ మూవీకి ఇంకా డేట్‌ ఫిక్స్‌ కాలేదు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం తన ముద్దుల పిల్లలని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే  అర్హా ఒక సినిమా చేస్తే ఇప్పుడు అయాన్ కూడా కెమెరాముందు కొస్తున్నాడట. ఇంకముందీ బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.    
అల్లు అర్జున్‌ పిల్లలకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అల్లు అయాన్, అల్లు అర్హా నాటీ వీడియోస్‌కి బోల్డన్ని కామెంట్స్‌ వస్తుంటాయి. ఇక అర్హతో బన్ని చేయించిన అంజలి.. అంజలి.. కవర్‌ సాంగ్‌కి కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇదే క్రేజ్‌తో గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాలో నటించింది అర్హా. యువరాజు భరతుడిగా చేసింది అర్హ.
అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్‌ కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తాడనే టాక్ వినిపిస్తోంది. 'అల వైకుంఠపురములో' ఓ మై గాడ్ డాడీ ప్రమోషనల్‌ సాంగ్‌లో కనిపించిన అయాన్, రీసెంట్‌గా 'గని' ఆంథమ్‌ సాంగ్‌కి కవర్‌ వెర్షన్‌ చేశాడు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.
వన్‌ నేనొక్కడినే సినిమాలో మహేశ్‌ బాబు కొడుకు గౌతమ్‌ కృష్ణ చిన్న రోల్‌ ప్లే చేశాడు. అలాగే అయాన్ కూడా బన్నీతో కలిసి సినిమాలో కనిపించే అవకాశముంది అంటున్నారు సినీ జనాలు. మరి బన్ని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతోన్న తండ్రీకొడుకుల కాంబినేషన్‌ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి. మొత్తానికి అల్లుఅర్జున్ తమ పిల్లలను సినిమాల్లో బిజీ చేసేందుకు ప్లాన్ చేస్తుండటంతో అల్లు ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. ఇక తమకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: