ఒకే కథ.. హీరోలు వేరు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్..!!

N.ANJI
సాధారణంగా చిత్ర పరిశ్రమలో కొత్త కథలు అంటూ ఏమి ఉండవు. ఏమి రావు కూడా.. వచ్చినా కథలోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని చిత్రీకరిస్తూ ఉంటారు. అంతేకాదు.. ఆ సినిమాకి కొంచెం కొత్త తరహ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రీకరించి మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తుంటారు. ఇక కొన్నిసార్లు వేరే ఇండస్ట్రీల సినిమా కథ నచ్చితే డబ్బింగ్ చెప్పించి సినిమాను చిత్రీకరించి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ చిత్రాన్ని చూసిన ఆ సినిమాను ఎక్కడో చుసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడి మదిలో మెదలాడుతూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే తరహ కథతో వచ్చి సక్సెస్ అయిన రెండు హిట్ సినిమాల ఒక్కసారి చూద్దామా.
తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆరో చిత్రం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు సరసన శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించారు. అయితే  దేవదాసు సినిమాలోని పార్వతి, చంద్రముఖిలను ప్రేరణగా తీసుకొని దాసరి నారాయణ రావు ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా 1981 ఫిబ్రవరి 18న విడుదల చేశారు. ఈ చిత్రం అప్పట్లోనే ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ మూవీలో ఏఎన్నార్ నటనకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
అయితే ప్రేమాభిషేకం సినిమా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత అలంటి కథనే కొంచెం మార్పులు చేసి బొబ్బిలి సింహం పేరుతో చిత్రీకరించారు. ఈ సినిమాని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో హీరోకి బదులుగా హీరోయిన్ కి క్యాన్సర్ పెట్టి దానిని దాచిపెట్టి హీరోకి మరో పెళ్లి చేస్తుంది హీరోయిన్.. దీనిని రచయిత విజయేంద్రప్రసాద్ సృష్టించారు. ఈ మూవీలో మీనా, రోజా ప్రధానపాత్రలో నటించగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: