ఎన్టీఆర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన 'బృందావనం'..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులోనే హీరోగా అరంగేట్రం చేసి అద్భుతమైన నటనను కనబరుస్తూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. మొదట్లో ఎక్కువగా మాస్ పాత్రలు చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత మెల్ల మెల్లగా తన పంథాను మార్చుకుంటూ అన్ని జోనర్ లను టచ్ చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కెరీర్లో 'బృందావనం' సినిమాకి మంచి ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన సినిమా ఇది. అప్పటివరకు ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించిన ఎన్టీఆర్..

వాటిని కాస్త పక్కకు పెట్టి సరికొత్తగా ప్రయత్నించిన సినిమా 'బృందావనం'  2010 దసరా కానుకగా అక్టోబర్ 14 న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతా, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ఇక దివంగత నటుడు శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు తదితరులు పలు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. సినిమాలో బ్రహ్మానందం, వేణుమాధవ్ ల కామెడీ కుటుంబాల మధ్య ఎమోషన్ సీన్స్, తమన్ అందించిన పాటలు, సమంతా, కాజల్ ల గ్లామరస్ అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓ సరికొత్త లుక్ లో కనిపించాడు.

 ఇక ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాను తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు 'అదుర్స్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దాంతో అదే మార్కెట్ 'బృందావనం' సినిమాకు కూడా కంటిన్యూ అయింది అని చెప్పొచ్చు. అదుర్స్ సినిమా కి దాదాపు 20 కోట్లు వచ్చాయి. దాంతో బృందావనం సినిమాకు 24 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక విడుదలయ్యాక ఫుల్ రన్లో మొత్తం 30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. సుమారు 6 కోట్లకు పైగా లాభాలని తీసుకొచ్చింది. రాజమౌళితో యమదొంగ సినిమా తర్వాత మళ్లీ ప్లాపుల బాట పట్టిన జూనియర్ ఎన్టీఆర్ కి అదుర్స్, బృందావనం సినిమాలు మళ్లీ ట్రాక్ ఎక్కించాయనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: