నాని దసరా సినిమాలో రొమాన్స్ కు చోటే లేదట...!

murali krishna
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారని తెలుస్తుంది.ప్రస్తుతం నాని అంటే సుందరానికి మరియు శ్యామ్ సింగరాయి చిత్రాలతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది దీనితో పాటు దసరా అనే సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

నాని దసరా సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలుస్తుంది.సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ లేదని సమాచారం.

ఈ సినిమాలో మహానటి కీర్తిసురేష్ నటిస్తుందని తెలిసినప్పటికీ సినిమా హీరోయిన్ పాత్రలో కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. పల్లెటూరి మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణ సింగరేణి మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఇక ఇందులో కీర్తి సురేష్ నానితో రొమాన్స్ కాకుండా ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోందని వార్త వినిపిస్తుంది.ఇందులో ఈమె పాత్ర ఎంతో కీలకమైనదని తెలుస్తుంది.

మొట్టమొదటిసారిగా నాని తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ మొదటి సారిగా హీరోయిన్ లేకుండా నటిస్తున్న చిత్రం దసరా అని తెలుస్తుంది.అయితే ఇందులో సమంత ఒక అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపించినప్పటికీ కూడా ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో సముద్రఖని మరియు సాయి కుమార్, జరీనా వాహబ్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారని తెలుస్తుంది.నాని సినిమా అంతే ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో అందరికి తెలుసు. దానితో పాటు హీరో మరియు హీరోయిన్ రొమాంటిక్ లవ్ సీన్స్ కూడా మంచి ప్రజాదరణ పొందుతాయి. మరి ఈ సినిమాలో రొమాన్స్ కు చోటే లేదని తెలుస్తుంది. చూడాలి యీ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో.ఇప్పటికే ఓటీటీ లో విడుదలైన నాని టక్ జగదీశ్ సినిమా పరాజయం పాలవటంతో నాని ఆశలన్ని తన తరువాతి సినిమాలపై ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: