స్వీటీ కాకుండా అనుష్కను ముద్దుగా ఏమంటారో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా చాలాకాలం పాటు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున సరసన 'సూపర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ముఖ్యంగా అగ్రహీరోల సరసన నటించి అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే భారీ క్రేజ్ ను దక్కించుకుంది. అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అద్భుత నటనను కనబరిచింది. ఇక అనుష్క కెరీర్లో 'బాహుబలి' సినిమా మరో మైలురాయి అని చెప్పవచ్చు.

 ఈ సినిమాలో ఆమె ప్రభాస్ కి జోడీగా దేవసేన పాత్రలో మెరిసింది. ఇక ఈ రోజు మన అనుష్క శెట్టి పుట్టినరోజు. నేటితో ఆమె ఆమె 40వ పడిలో లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకి అభిమానులు, సెలబ్రిటీలు బర్తడే విషెస్ ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అగ్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ తమ 48వ చిత్రాన్ని అనుష్కతో చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క వ్యక్తిగత విషయాలకు వస్తే.. మంగళూరులో పుట్టిన అనుష్క..

 తన స్కూలింగ్ మొత్తం బెంగళూర్ లోనే జరిగింది. ఇక ఈమె మాతృభాష తుళు. ఇక అనుష్కను ఈమె కుటుంబ సభ్యులు ముందుగా స్వీటీ అని పిలుస్తారు. ఈ హీరోయిన్ కి మరో ముద్దు పేరు కూడా ఉంది. ముఖ్యంగా అనుష్క సన్నిహితులు ఈమెను ముద్దుగా 'టొమ్ములు' అని పిలుస్తారట. హిస్టరీ, సైకాలజీ, ఎకనామిక్స్, సోషియాలజీ లో డిగ్రీ పూర్తి చేసిన అనుష్క బీసిఏ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఓ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ యోగా టీచర్ గా కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాతే హీరోయిన్ గా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఇక్కడ కూడా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: