అనుష్కకు పెళ్ళి కాకపోవడానికి కారణం ఇదే..జాతకంలో అంత పెద్ద దోషమా..?

VUYYURU SUBHASH
అనుష్క..తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ. అప్పుడెప్పుడో 16ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున సూపర్ అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఆ తరువాత వరుసుగా అవకాశాలను అందుకుంటూ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ బడా హీరోల సరసన నటించిన హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతేకాదు హీరోయిన్స్ అంటే గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు.. ఓ సినిమా హిట్ అవ్వాలంటే హీరోనే ఉండక్కర్లేదు అంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి..స్టార్ హీరోలకు సైతం తన నటనతో చెమటలు పట్టించిన నటి ఈ అనుష్క.
 దర్శక ధీరుడు డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా లో మాస్ మహరాజ రవుతేజ తో జోడి కట్టి ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయిన అనుష్క.. అరుంధతి సినిమాతో ఏకంగా ప్రేక్షకుల మదిలో జేజమ్మ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా లో దేవసేన గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నటించి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే రీజన్ తెలియదు కానీ అనుష్క ఎందుకో ఈ మధ్య సినిమాలకు కాస్త దూరం ఉంటుంది. అవకాశాలు వస్తున్నా కూడా వాటిని రిజెక్ట్ చేస్తుందనే  వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా 40 ఏళ్లు దాటినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ గా ఉంది అనుష్క. ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అమ్మడు మాత్రం  ఆ గుడ్ న్యూస్ చెప్పట్లేదు కాదు కదా..అసలు పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఇక ఈ క్రమంలో  ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే.. అనుష్కకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆమె జాతకంలో ఓ దోషం ఉందట. ఆ రీజన్ వల్లే ఆమెకు ఇన్ని సంవత్సరాలు అయినా పెళ్లి కావడం లేదు అని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి అంటే అనుష్క నోరు విప్పాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: