జబర్దస్త్ కు మళ్లీ ఇంద్రజ వచ్చేసింది.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?
ఇంద్రజ వయసు పెరిగింది.. కానీ ఇప్పటికీ వన్నె తరగని అందం ఆమె సొంతం అని చెప్పాలి. అయితే కొన్నాళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అడపాదడపా పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై జబర్దస్త్ కార్య క్రమంలో జడ్జిగా అవతారమెత్తింది. ఇక తన అందమైన చిరునవ్వుతో ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ క్రమంలోనే ఇంద్రజనే పూర్తిస్థాయిలో జబర్దస్త్ జడ్జిగా కొనసాగించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత రెగ్యులర్ జడ్జి రోజా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ప్రస్తుతం ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం లో జడ్జిగా కొన సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరోసారి జబర్దస్త్ జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చింది ఇంద్రజ. దీంతో ఫాన్స్ అందరు ఫుల్ హ్యాపీ అయి పోయారు. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. జడ్జిగా మరోసారి జబర్దస్త్ లో కనిపించిన ఇంద్రజ తన అందమైన చిరునవ్వు తో మరో సారి బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పాలి.