అనుష్క శెట్టి అందుకున్న అవార్డులు ఎన్నో తెలుసా..?

Divya
అనుష్క శాండిల్ వుడ్ భామ అయినప్పటికీ మొదటిసారి తెలుగు లోనే తన సత్తా ఏంటో చాటుకుంది.. అంతేకాదు ఈమెకు అవకాశం ఇచ్చింది కూడా తెలుగు సినిమానే కావడం చేత ఈమె ఎక్కువగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా కూడా అనుష్క గుర్తింపు పొందింది. సినీ ఇండస్ట్రీలో అత్యధిక అవార్డులు అందుకున్న అతికొద్ది మందిలో అనుష్క కూడా ఒకరు కావడం గమనార్హం.. ఇక ఈమె అందుకున్న అవార్డులు విషయానికి వస్తే, అనుష్క దాదాపుగా మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.
రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ , తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల తో పాటు అత్యంత గౌరవ పురస్కారమైన తమిళనాడు కలైమామణి అవార్డును కూడా సొంతం చేసుకుంది. 2009 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాలో నటించిన అనుష్క నటనకు,  ఏకంగా నంది అవార్డు గెలుపొందడమే కాదు ఉత్తమ నటిగా కూడా సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత 2010లో వచ్చిన వేదం సినిమాలో మొదటిసారి ఈమె వ్యాంప్ క్యారెక్టర్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఈ సినిమాలో అనుష్క నటనకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఇక 2015 లో నటించిన రుద్రమదేవి సినిమా  ద్వారా ఉత్తమ నటిగా సినిమా అవార్డును  కైవసం చేసుకుంది. సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు విజయ్ అవార్డ్ లకు కూడా నామినేట్ చేయబడిన అక్కడ కూడా కొన్ని అవార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి 2 సినిమా కు గాను తమిళ్ భాష నుంచి ఉత్తమ నటి క్యారెక్టర్ గా బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. డమరుకం సినిమాకు బెస్ట్ హీరోయిన్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది అనుష్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: