సంక్రాంతి రేసు నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నట్టెనా..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తూండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రకని ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల కు సంబంధించిన ప్రోమో లను చిత్రబృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ఆ మధ్య ఒక సారి ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

 దీనితో దసరా కు ఏ స్టార్ హీరో కూడా తమ సినిమా విడుదల తేదీలను ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాలను ఆర్ఆర్ఆర్ విడుదల తేదీకి కు సంబంధం లేకుండా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాను దసరా బరి నుండి తప్పించి సంక్రాంతి కి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు అనుకున్న తేదీకే విడుదల అవుతాయా అని జనాలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూశారు. ఇలాంటి సమయంలోనే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కార్ వారి పాట సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాను కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకోబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఈ మధ్య దీపావళి సందర్భంగా భీమ్లా నాయక్ చిత్ర బృందం విడుదల చేసిన ప్రోమో లో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడంతో ఈ వార్తలు నిజమే అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: