రాజమౌళి కోసం వెనక్కి తగ్గిన మహేష్ బాబు..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో ఏర్పడిన కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది, గత కొద్ది కాలం క్రితం ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనితో ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఆ తేదీ దగ్గరలో తమ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. సంక్రాంతికి మాత్రం తెలుగు స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తమ సినిమాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇలా వీరు తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా దసరా బారి నుండి ఆర్ఆర్ఆర్ సినిమాను తప్పించి సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనితో తెలుగు స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల విడుదల తేదీ లలో మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు అనేక రోజులుగా అనేక కథనాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు మాత్రం తన సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు ఇదివరకు కూడా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బహుబలి సినిమా కోసం కూడా తన శ్రీ మంతుడు సినిమాను వాయిదా వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: