ఓకే హిట్... అక్టోబర్ కూడా పెద్దగా కలిసి రాలేదు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమకి అక్టోబర్ నెల పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ నెలలో చాలా సినిమాలే విడుదల కాగా వాటిలో ఒకే ఒక సినిమా మాత్రం హిట్ అయి ప్రేక్షకులకు మరొకసారి నిరాశనే మిగిల్చింది. దాంతో అక్టోబర్ నెల మరొక సాదాసీదా నెల గా మిగిలిపోయింది అని చెప్పవచ్చు. మరి ఈ అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

అక్టోబరు 1వ తేదీన సాయి ధరం తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల కాగా అది ప్రేక్షకులను కొంతవరకు మెప్పించింది అని చెప్పొచ్చు.  బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనుకున్న కలెక్షన్లు సాధించిన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ హిట్ ఇచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం రాబట్టుట్టుకోలేక పోయింది అని చెప్పాలి. దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సందేశం ఎక్కువై పోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. మంచి డైలాగులు ఉన్నప్పటికీ కూడా మాస్ ప్రేక్షకులకు అవి లెక్క లేదు. దాంతో ఈ సినిమా యావరేజ్ గానే మిగిలిపోయింది.

ఆ తర్వాత ఇదే మా కదా ఆట నాదే వేట నాదే వంటి సినిమాలు వచ్చాయి అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక కొండపొలం సినిమా అసలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఆ తర్వాత గోపీచంద్ ఇప్పుడు నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదలై ఆరు రోజులు కూడా ఆడలేకపోయింది. దసరా బరిలో దిగిన మహాసముద్రం సినిమా అట్టర్ ఫ్లాప్ కాగా అఖిల్ నటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ నెలలో వచ్చి వచ్చిన అన్ని సినిమాల కంటే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పెళ్లి సందడి సినిమా వరుడు కావలెను రొమాంటిక్ సినిమాల సంగతి చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. ఆయన సినిమాలు కనీస పెట్టుబడులు కూడా తిరిగి రాబట్టుకునే లేకపోయాయి అని చెప్పవచ్చు. ఏదేమైనా అక్టోబర్ నెల పోటీలో అఖిల్ విజేతగా నిలిచి తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: