ఆ విషయంలో అసూయ పడొద్దంటున్న అల్లుఅర్జున్...!

murali krishna
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని మరియు శాన్వి మేఘన నాయికలుగా నటించారని తెలుస్తుంది.. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయని సమాచారం.. గోవర్ధన్ రావు దేవరకొండ మరియు విజయ్ మట్టపల్లి అలాగే ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారని తెలుస్తుంది.. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న “పుష్పక విమానం” చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయని సమాచారం.. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగిందని ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారని తెలుస్తుంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్పక విమానం ట్రైలర్ చాలా బాగుందని నేను రిలీజ్ చేయకున్నా ఇదే విషయం ట్వీట్ చేసేవాడిని అన్నారట.పుష్పక విమానం ట్రైలర్ నాకు బాగా నచ్చిందని మీ అందరికీ తెలుసు నాకు సినిమా నచ్చకుంటే ఆ సినిమా ఫ్రెండ్స్ సినిమా అయినా మరియు మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడనని నచ్చితే మాత్రం వీలైనంత
సపోర్ట్ చేస్తుంటానని చెప్పాడట.పుష్పక విమానం సినిమా ట్రైలర్ చూసిన తరువాత సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడిందని సినిమా విజయవంతం అవుతుందనే వైబ్స్ తెలుస్తున్నాయని అందుకే ఈ టీమ్ కు ఆల్ ద బెస్ట్ కాకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నానని చెప్పాడట.విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టమని అతను సెల్ఫ్ మేడ్ యాక్టర్ అని నటుడిగా ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు మరియు అర్జున్ రెడ్డి ఇలా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడని సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తానని చెప్పాడట.విజయ్ ఎదుగుదల నా విజయం అనుకుంటానని అతనికి పేరొస్తే సంతోషించే వాళ్లలో నేనూ ఉంటాను అన్నారని తెలుస్తుంది..
నువ్వూ ఇంకా పేరు తెచ్చుకుంటాడని నమ్మకముందని విజయ్ కు మంచి మనసు, మేధస్సు ఉన్నాయని పాజిటివ్ గా ఆలోచిస్తాడని ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్లు అందరితో సరదాగా ఉండలేరని కానీ విజయ్ ఇంటెలిజెంట్ అయినా కూడా స్నేహంగా అలాగే కలుపుగోలుగా ఉంటాడని విజయ్ లా ఇంత తక్కువ టైమ్ లో స్టార్ అయిన నటుడిని చూడలేదని చెప్పుకొచ్చాడాట.. విజయ్ తన
సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా విభిన్నమైన సినిమాలే చేస్తాడని  విజయ్ నాకు పంపే రౌడీ క్లోత్స్ చాలా ఇష్టం అంటూ ఆకాశానికెత్తేశాడట బన్నీ. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మీరు సొంత ప్రొడక్షన్ పెట్టడం నిజంగా మంచి విషయమని ఎంతోమంది టాలెంట్ పీపుల్ కు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నని చెప్పాడట.విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉండదా
అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారని నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి ఇన్స్ పైర్ అవ్వాలి కానీ అసూయ పడొద్దని చెప్పాడని తెలుస్తుంది.అలా విజయ్ ఎదుగుతుంటే అతన్ని చూసి నేనూ స్ఫూర్తిపొందుతానని అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి కూడా అంటూ పుష్పక విమానం సినిమాతో మీరు హిట్ కొట్టారనే అనుకుంటున్నానని కోవిడ్ టైమ్ లో రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చాడట అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: