బిగ్ బాస్ - 5 : అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు.. టాప్ హైలైట్స్ ఇవే..!!

Anilkumar
బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రేటింగ్స్ పరంగా గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కి కాస్త తగ్గిందనే చెప్పాలి. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి రెండు వారాలలో మంచి రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా రేటింగ్ తగ్గుతూ వచ్చింది.వీకండ్ ఎపిసోడ్లో, సెలబ్రిటీలు వచ్చినప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ లో మాత్రమే రేటింగ్ వస్తోంది. అందులో మొన్న దసరా స్పెషల్ ఎపిసోడ్ చూసుకుంటే 4 గంటలు టెలికాస్ట్ చేశారు. దాంతో మంచి రేటింగ్ కూడా ఆ ఎపిసోడ్ కి వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి ఒక భారీ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అంటూ నేటి సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అయితే మరోవైపు నేడు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంవల్ల కచ్చితంగా దాని ప్రభావం ఈ షోపై పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రేటింగ్ పై ఏమైనా ప్రభావం పడుతుందేమో అనేది చూడాలి. ఇక దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా గత సీజన్లో పాల్గొన్న పాత కంటెస్టెంట్ లు ఈ ఎపిసోడ్లో సందడి చేయబోతున్నారు. అంతేకాదు ఆ కంటెస్టెంట్ లను హౌస్ లోకి కూడా పంపిస్తున్నారు.

మరోవైపు పుష్పక విమానం ప్రమోషన్స్ లో భాగంగా దేవరకొండ బ్రదర్స అయిన విజయ్, ఆనంద్ ఇద్దరూ హాజరు కాబోతున్నారు. ఇక వీరితో పాటు మన టాప్ యాంకర్ సుమ ఎపిసోడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇంకా ప్రముఖ హీరోయిన్స్ డాన్సులు.. మాజీ కంటెస్టెంట్స్ కామెడీ స్కిట్లు.. మోనాల్, దివి, ప్రముఖ సింగర్ కల్పన బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంచి రోజులు వచ్చాయి' సినిమా యూనిట్ కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్ లో దర్శనమివ్వనున్నారు.  అలా ఇన్ని హైలెట్స్ తో దీపావళి ఎపిసోడ్ సంబరాలు అంబరానికి అంటేలా ఉండబోతున్నాయి. అంతేకాకుండా దసరా ఎపిసోడ్ ని మించి ఈ దీపావళి ఎపిసోడ్ ఉండబోతోందని చెప్తున్నారు నిర్వాహకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: