అందుకే అనుష్క సినిమా లు చేయట్లేదు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ఖాళీగా ఉండి సినిమాలు చేయకుండా ఉన్న హీరోయిన్ లలో ఒకరు అనుష్క. సూపర్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే అందరిని ఆకర్షించి తనకు ఎదురు లేకుండా చేసుకుంది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఆమె చేసిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వచ్చాయి.

దాంతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చిన్న హీరోలకు అందకుండా ఆమె స్టార్ గా దూసుకు పోయింది. అలా ఆమె కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పాపులారిటీ దక్కించుకోగా ఆ తర్వాత ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై కాన్సన్ట్రేట్ చేసింది. ఏ హీరోయిన్ అయినా కెరియర్ ఎండింగ్ లో ఇలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంది. కానీ అనుష్క మాత్రం తన కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే అరుంధతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించింది.

ఆ సినిమా విజయం భారీగా ఉండటంతో అనుష్క తన క్రేజ్ ను డబల్ చేసుకుందని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా, లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కలిపి నటించింది. బాహుబలి సినిమా ఆమె కెరియర్ లోనే టాప్ సినిమా అని చెప్పవచ్చు. తర్వాత ఆమె ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం ఆమె నటించడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె అభిమానులు మాత్రం ఆమె సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఒకరు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అందుకే సినిమా లు మానేస్తుంది అని అంటున్నారు. ఇంకా కొందరు బాగా లావు అవడం వల్ల ఆమెకు సినిమా అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: