వామ్మో జబర్దస్త్ చంటిలో ఈ టాలెంట్ కూడా ఉందా?

praveen
చలాకి చంటి.. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా కొనసాగుతున్న చంటి ఇక జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు చలాకి చంటి. కొన్నాళ్లపాటు జబర్దస్త్ దూరమైనప్పటికీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో ప్రస్తుతం టాప్ టీవీ లీడర్ లలో ఒకరు గా కొనసాగుతున్నాడు చలాకి చంటి. ఎప్పుడూ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

 అయితే చలాకి చంటి అద్భుతంగా కామెడీ చేసి ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించగలడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయం అటు సినిమాల్లో కూడా నిరూపితమైంది. అదే సమయంలో ఇక చంటి వ్యాఖ్యాతగా కూడా అదరగొడతాడు అని ఇప్పటికే ద్వారా ప్రేక్షకులకు తెలిసిందే. నా షో నా ఇష్టం అనే కార్యక్రమం ద్వారా  కొన్నాళ్లపాటు చంటి యాంకరింగ్ తో కూడా అదరగొట్టాడు. అయితే ఇటీవలే ప్రేక్షకులకు ఎవరికీ తెలియని సరికొత్త టాలెంట్ చంటి లో దాగి ఉంది అన్న విషయం బయటపడింది. ఇటీవలే దీపావళి సందర్భంగా తగ్గేదేలే అనే కార్యక్రమం రాబోతుండగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇటీవలే  విడుదలైంది.

 ఇక ఈ ప్రోమోలో భాగంగా చలాకి చంటి ఒక అదిరిపోయే పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ ఓ లైలా ఓ చారుశీల అంటూ సాగిపోయే ఒక పాటను పాడి.. అదరగొట్టాడు చలాకి చంటి. కేవలం పాట పాడటమే కాదు పాట పాడుతున్న సందర్భంలో చలాకి చంటి ఆటిట్యూడ్ కూడా ఎంతగానో ఆకర్షించింది అనిచెప్పాలి. ఏకంగా ఆ పాట పాడుతున్న సమయంలో పూర్తిగా పాటలో లీనమై పాడాడు. ఇక ఈ పాట పాడిన తర్వాత జబర్దస్త్ జడ్జి రోజా కూడా షాక్అయింది అని చెప్పాలి. చంటి నువ్వు ఇంత బాగా పాట పాడు తావు అని అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్ కూడా చేసింది రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: