హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే రిపీట్ చేస్తున్న సూర్య...

NIKHIL VINAY
తమిళ్ తెలుగు భాషల్లో బాగా ఫేమస్ అయిన హీరో సూర్య . ఆయన సినిమాలకి రెండు భాషల్లోనూ భారీ క్రేజ్ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సూర్య కి సరైన హిట్ లేదు. అలాంటి సమయంలోనే చివరి సంవత్సరం లో వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమా ఆయనకి హిట్ లేని లోటు తీర్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై గొప్ప పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా డైరెక్టర్ సుధ కొంగరాకి ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి.ప్రభాస్ తో ఆమె సినిమా ఫిక్స్ అయ్యింది అని కూడా వార్తలు వచ్చాయి కానీ వాటిలో ఏది ఆఫీషల్ గా బయటకి రాలేదు. అయితే  ఆమె ఇప్పుడు మళ్లీ సూర్య నే హీరోగా ఎంచుకోబోతుంది అని టాక్. ఈమధ్యనే ఆమె చేయబోయే కొత్త సూర్య కి వినిపించగా ఆయన వెంటనే ఓకే అన్నారట. ఈ సినిమా త్వరలోనే మొదలుకాబోతుంది అని టాక్. ఆకాశమే హద్దురా కి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ ఈ సినిమాకి కూడా సంగీతం ఇవ్వబోతున్నారు అని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు.

 ప్రస్తుతం సూర్య పండిరాజ్ డైరెక్షన్ లో ఒక మాస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందన పొందింది. ఈ ఏడాది చివరగాని వచ్చే ఏడాది మొదటి నెలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అలాగే సూర్య నటించిన ఇంకొక చిత్రం జై భీమ్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2 న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సూర్య ఒక లాయర్ గా కనిపించబోతున్నారు. అలాగే రావు రమేష్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఒక దళిత మహిళకి జరిగిన అన్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: