టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ కొట్టిన "రాధే శ్యామ్"

NIKHIL VINAY
నాకు నువ్వు ఎవరో తెలుసు కానీ నేను చెప్పను అని పుట్టినరోజు నాడు ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్ తో వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఈ సినిమా మీద చాలా డౌట్స్ ఉండేవి. చాలామంది ప్రభాస్ అసలు ఈ సినిమా మీద అంచనాలు పెట్టుకోవడం వేస్ట్ అని అనుకున్నారు. లేట్ అప్డేట్స్ , పెద్దగా ఉత్సహం ఇవ్వని పోస్టర్స్ ఇలా రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలు పడిపోతున్న సమయంలో ప్రభాస్ పుట్టిన రోజున వచ్చిన రాధే శ్యామ్ టీజర్ అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ టీజర్ చూసాక చాలామంది ఇలాంటి స్టఫ్ పెట్టుకొని ఇన్ని రోజులు ప్రమోషన్స్ ఎందుకు చేయలేదు అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. జ్యోతిష్యం చెప్పే విక్రమ్ ఆదిత్య గా మనకు ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ రాధే శ్యామ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ చేస్తున్న సినిమా నుంచి చాలా రోజుల తర్వాత ఒక టీజర్ రావడంతో ఆయన అభిమానులు ఈ టీజర్ టాప్ పొజిషన్ లో నిలబెట్టారు. ఒక్క రోజులోనే ఈ టీజర్ ని 50 మిలియన్స్ మంది చూశారంటే అర్థం చేసుకోవచ్చు రాధే శ్యామ్ టీజర్ వారికి ఎంత నచ్చింది. ఈ టీజర్ ఇప్పుడు టాలీవుడ్ లో అల్ టైం రికార్డ్ కొట్టింది. ఇప్పటిదకా ఏ తెలుగు సినిమా టీజర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.

50 మిలియన్ వ్యూస్ రావాలి అంటే మన తెలుగు సినిమాలకు దాదాపుగా 10 రోజులు పడుతుంది. కానీ రాధే శ్యామ్ ఒక్క రోజులో ఆ రికార్డ్స్ ని తుడిచిపెట్టింది.ఇక ఈ సినిమా జనవరి నెలలో ఘనంగా విడుదల కాబోతుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా చైనా లో కూడా ఈ సినిమాని విడుదల చేయడానికి మూవీ టీం ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: