ప్ర‌భాస్ అభిమానుల్లో ఎందుకు ఈ ద‌డ‌.. తేడా కొడుతోందా..!

VUYYURU SUBHASH
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సిని మాతో దేశ వ్యాప్తంగానే తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్ర‌భాస్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ అయిపోయాడు. మ‌నోడికి అన్ని సినిమా ఇండ‌స్ట్రీలే జేజేలు ప‌లుకుతున్నాయి. బాహుబ‌లి 1, 2 త‌ర్వాత మ‌నోడు సాహో సినిమా చేశాడు. సాహో సినిమా సైతం తెలుగు లో ప్లాప్ అయినా బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. సాహో ప్లాప్ అయినా కూడా ప్ర‌భాస్ ఇమేజ్ తో నార్త్ లో క‌లెక్ష‌న్లు కుమ్మేసింది.
సాహో వ‌చ్చి కూడా రెండేళ్లు దాటుతోంది. ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రభాస్ న‌టిస్తోన్న తాజా సినిమా రాధే శ్యామ్ . రెండేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. మ‌రో వైపు రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి వ‌స్తున్నా కూడా రాధే శ్యామ్ యూనిట్ ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.
అయితే ఇప్పుడు రాధే శ్యామ్ టీజ‌ర్ వ‌చ్చింది. ఇది పెద్ద‌గా ఆస‌క్తి రేకెత్తించ లేదు. ఏదో ఇంగ్లీష్ లో కొన్ని డైలాగులు చెప్పించారు ప్ర‌భాస్ తో. అవేమి సామాన్య జ‌నాల‌కు పెద్దగా ఎక్క‌లేదు. టీజ‌ర్ పెద్ద‌గా కిక్ అయితే ఇవ్వ‌లేదు. ప్రేక్ష‌కుల‌కు సాహో సినిమా లా ఈ టీజ‌ర్ కూడా అర్థం కాలేదు.. ఈటు మాసివ్ లుక్ కూడా లేదు. దీంతో ప్ర‌భాస్ అభిమానుల్లో రాధే శ్యామ్ పై ఎక్క‌డో లోప‌ల ఆందోళ‌న స్టార్ట్ కావ‌డ‌తో పాటు తేడా కొడుతోంద‌ని అంటున్నారు.
సాహో ఎలా అయితే తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థం కాకుండా ఇక్క‌డ ప్లాప్ అయ్యిందో ఇప్పుడు రాధే శ్యామ్ కూడా అలాగే అవుతుందా ? అన్న టెన్ష‌న్ అయితే యంగ్ రెబ‌ల్ స్టార్ అభిమానుల్లో మొద‌లు అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: