ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా...?

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధంగా ఉందని అందరికి తెలుసు.. ఈ ఎపిక్ డ్రామాను దిగ్గజ దర్శకుడు అయిన రాజమౌళి రూపొందిస్తుండగా, రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో నటించాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ చిత్రం గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తరువాత వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారని తెలుస్తుంది. కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో నటించబోతున్నాడని సమాచారం.. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నాడని వార్త వినిపిస్తుంది.
బాజీరావ్ మస్తానీ మరియు రామ్ లీలా అలాగే పద్మావత్ వంటి అద్భుతమైన పీరియాడికల్ సినిమాలను వెండి తెరపై ఆవిష్కరించిన బాలీవుడ్ అగ్ర దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడని వార్త వినిపిస్తుంది.ఈ వార్త గనుక నిజమైతే ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇదే అవుతుందని సమాచారం.మకుట విఎఫ్ఎక్స్ ఈ పీరియాడిక్ డ్రామా కోసం స్కెచ్‌లను సిద్ధం చేస్తోందని వార్త వినిపిస్తుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని తెలుస్తుంది.
మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న “ఆర్ఆర్ఆర్”తో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన “గంగూబాయి కతియవాడి” గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. రెండూ వేర్వేరు జోనర్ సినిమాలు అయినప్పటికీ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న మరియు “గంగూబాయి కతియవాడి” జనవరి 6న ఒకరోజు గ్యాప్ తో విడుదల కానున్నాయని తెలుస్తుంది.అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఆర్. ఆర్.ఆర్ ఫలితంపై ఆధారపడి ఉందని తెలుస్తుంది.మరి చూడాలి రాజమౌళి సినిమా ఎన్టీఆర్ కు ఏవిధమైన పేరు తెచ్చిపెడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: