ఎలాంటి ఉప్పెన వచ్చిన స్టార్ హీరో లు తగ్గరా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోల రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వారి రేంజ్ పెరుగుతున్న కొద్దీ వారికి సంబంధించిన పారితోషికం కూడా అదే విధంగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే టాలీవుడ్ కి పరిమితమైన మన హీరోల సినిమాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. అవి అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించడంతో దేశవ్యాప్తంగా కూడా వారికి మంచి మార్కెట్ ఏర్పడుతుంది. తద్వారా సదరు నిర్మాతకు పెట్టిన డబ్బు కంటే భారీ రేంజ్ లో వసూళ్లు వస్తుండగా హీరోలు కూడా ఆ వసూళ్లకు తగ్గట్లుగానే పారితోషకాన్ని పెంచేస్తున్నారు.

గతంలో అంతగా లేని పారితోషకాలు ఇప్పుడు వందల కోట్లలో కి పెరిగిపోవడం ఒక్కసారిగా  అందరికీ షాక్ ఇస్తుంది. అలా సినిమా బడ్జెట్ ను బట్టి తమ పారితోషకాలు నిర్ణయించుకున్న మన హీరోలు ఎవరు ఎన్ని కోట్లు అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరి కంటే ఎక్కువగా 80 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా దిశగా విడుదల కాబోతు ఉండడంతో ఆయన కు అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది అని చెప్పవచ్చు.

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 65 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికిగాను 65 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. ఇక మహేష్ మొన్నటిదాకా 50 కోట్ల పారితోషికం తీసుకునే వాడు ఇప్పుడు కొత్తగా చేసే సినిమాలకు 55 కోట్ల పారితోషికం తీసుకోవడమే కాకుండా వాటా కూడా అడుగుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు 40 కోట్ల తీసుకోగా ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలకు ఆఫ్ సెంచరీ మార్క్ ను దాటించనున్నాడు. చిరంజీవి ఆచార్య చిత్రానికి 35 కోట్లు తీసుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప రెండు పార్ట్స్ కి కలిపి అరవై ఐదు కోట్లు తీసుకోగా బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు దాదాపు 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ 30 కోట్ల పారితోషికాన్ని తీసుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: