'పెళ్లి సందD' హీరోయిన్ కు వరుస అవకాశాలు?

praveen
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమలో నిలకడగా అవకాశాలు అందుకుంటూ వుంటారు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ ఉంటారు. అయితే సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎంత టాలెంట్ వున్నప్పటికీ ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెబుతూ ఉంటారు సినీ పెద్దలు. అదృష్టం లేదు అంటే ఎంత టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు దక్కించుకోవడం మాత్రం చాలా కష్టం అని అంటూ ఉంటారు.  ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్ల విషయంలో కూడా రుజువైంది.

 కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే దర్శకునిర్మాతలను ఆకర్షించి వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటే.. కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ నటనతో ప్రశంసలు అందుకున్న.. అవకాశాలను అందుకోలేక చిత్ర పరిశ్రమలో కనుమరుగు అవుతూ ఉంటారు. అయితే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్ ఇక ఇప్పుడు వరుస అవకాశాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.

 ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ నటించగా.. ఇక రోషన్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించింది. ఇక ఒక్క సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు తన నటన డాన్సులతో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సొగసరి. ఇక ఒక్క సినిమాతోనే అటు దర్శక నిర్మాతలు అందరి చూపు ఈ అమ్మడి వైపు మళ్ళింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కుర్రహీరోలు ఆమెనే తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ యంగ్ హీరోయిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: