ప్రభాస్ ఒక్కడే నిలబడతాడా!!

P.Nishanth Kumar
2022 సంక్రాంతి సందర్భంగా పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.  ఇప్పటికే జనవరి 7వ తేదీ న ప్రేక్షకుల ముందుకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా  నటించిన ఈ సినిమా ముందుగానే విడుదల అవుతుందని భావించగా సంక్రాంతి సీజన్ ను ఈ సినిమా బృందం ఎంచుకోవడం విశేషం. దేశ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే అదే సీజన్ కు మరికొన్ని సినిమా లు కూడా ఇప్పటికే విడుదల తేదీ ని అనౌన్స్ చేశాయి. పవన్ కళ్యాణ్ నటించిన భిమ్లా నాయక్ సినిమా అలాగే మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగా వరుసగా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల ను ఏ మాత్రం పట్టించుకోకుండా రాజమౌళి తన సినిమాను విడుదల ప్రకటించడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది.

అంత పెద్ద సినిమాలు వస్తున్నా కూడా విడుదల చేయక తప్పటం లేదు అని రాజమౌళి చాలా సార్లు చెప్పాడు. ఇప్పటికే ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన పోస్ట్ పోన్ కాగా సర్కారు వారి పాట ఏప్రిల్ 28న విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అలాగే పవన్ తన భీమ్లా నాయక్ చిత్రాన్ని కూడా మార్చి 31వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి కి ఒక్క ప్రభాస్ తప్ప ఎవరు ఎదురెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: