ఏఆర్ మురుగదాస్,విజయ్ ల స్టైలిష్ యాక్షన్ చిత్రం తుపాకీ..

P.Nishanth Kumar
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2012వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తుపాకీ. విజయ్ దళపతి హీరోగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ప్రతి నాయకుడిగా నటించారు. హరీష్ జయరాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2012లో ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే భారీ వసూళ్లను అందుకోగా విజయ్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకు పోతున్న విజయ్ తో కలిసి మురుగదాస్ తొలిసారిగా ఈ చిత్రాన్ని చేశాడు. తుపాకీ సినిమా అనుకున్నట్లుగానే సూపర్ హిట్ కాగా ఈ చిత్రం కొత్త రకమైన అనుభవాన్ని ప్రేక్షకులకు పంచింది. ఈ చిత్రంలో కథానాయికగా ముందుగా మోడల్ ఏంజెలా జాన్సన్ ఎంపిక చేయగా చివరికి కాజల్ ను ఎంపిక చేశారు.  అక్షర గౌడ కూడా ప్రత్యేక పాత్రలో నటించింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ లో మంచి మంచి అవార్డులను అందుకోగా హిందీలో హాలిడే అనే పేరు తో అక్షయ్ కుమార్ ఈ సినిమాను రీమేక్  చేశాడు. 

బోర్డర్ లో నిస్వార్థమైన సేవలు అందిస్తున్న ఆర్మీ కి సంబంధించిన కొంత మంది వ్యక్తులు సెలవుల నిమిత్తం ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు చేరుకుంటారు. ఆ సమయంలోనే హీరో తన ఇంటికి వచ్చిన తర్వాత వరుసగా బాంబ్ బ్లాస్ట్ లు దేశంలో జరగబోతున్నాయి అని తెలుసుకుంటాడు. దాంతో ఎలాగైనా వాటిని ఆపాలని చెప్పి దేశాన్ని బోర్డర్ లోనే కాదు దేశం లోపల కూడా కాపాడాలి అని చెప్పి ఆయన తన స్నేహితులతో కలసి ఎలా ఆ బాంబ్ బ్లాస్ట్ లను ఆపాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు దారి తీసాయి. ఆ పరిణామం లో తన స్నేహితులతో పాటు తాను కూడా ఈ విధంగా ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ సినిమా కథ. ఆర్మీ వారి సత్తా చాటిన సినిమా ఇది అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: