“ఎఫ్3” విడుద‌ల ఎప్పుడో తెలుసా..?

N ANJANEYULU
టాలివుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు నిర్మాణంతో అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంకటేష్, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టించిన ఎఫ్‌-2 మూవీ తెలుగు ఇడ‌స్ట్రీని షేక్ చేసిన విష‌యం విధిత‌మే. 2019 సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేశారు. అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించింది ఎఫ్‌2. కొన్నేండ్ల త‌రువాత వెంక‌టేష్‌లో దాగి ఉన్న కామెడి యాంగిల్‌ను బ‌య‌టికి తీసుకొచ్చింది ఆ సినిమా. మ‌రోవైపు వ‌రుణ్‌తేజ్ కేరీర్‌లో కూడ ఆ సినిమా పెద్ద హిట్‌గానే నిలిచింది. రూ.130 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి నిర్మాత దిల్‌రాజుకు లాభాలు తెచ్చిపెట్టింది.
అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన త‌రువాత ఇప్పుడు ఎఫ్‌3 సినిమాపై అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ‌రుస‌గా 5 విజ‌యాల త‌రువాత డ‌బుల్ హ్యాట్రిక్ కోసం అనిల్ ఎఫ్‌3 సినిమా చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గానే.. ఈసినిమా 2022 సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇదివ‌ర‌కే చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కానీ తాజాగా సంక్రాంతి బ‌రిలో నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది యూనిట్‌. వ‌చ్చే సంక్రాంతికి ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా భీమ్లానాయ‌క్‌, మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట సినిమాలు వ‌స్తున్నాయి. వీటితో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఆర్ఆర్ఆర్ కూడా బ‌రిలో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న ఎఫ్‌-3 విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని మూవీమేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా బొమ్మ ఎప్పుడు ప‌డితే అప్పుడే మ‌న‌కు న‌వ్వుల పండుగ అని మూవీకి సంబంధించిన నూత‌న పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఇక ఎఫ్‌3 సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఈ చిత్రంలో వెంక‌టేష్ జోడిగా త‌మ‌న్నా, వ‌రుణ్‌తేజ్‌కు జోడిగా మెహ్రిన్  ప్ర‌ధాన  పాత్ర‌దారులుగా న‌టిస్తున్నారు. వీరితో పాటు హిందీ న‌టుడు బొమ‌న్ ఇరానీ, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, సునీల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం క‌థ అంతా డ‌బ్బు చుట్టే తిరుగుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

#f3

సంబంధిత వార్తలు: