బాలకృష్ణని యాక్షన్ హీరోగా నిలబెట్టిన డైరెక్టర్ ఆయనేనా...?

murali krishna
ప్రజల నాడిని కరెక్టుగా పట్టుకొని సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటని అందరికి తెలుసు.ఇంతకీ ఆయన ఎవరంటే సంచలన డైరెక్టర్ అయిన బి.గోపాల్. ఆయన సినిమా తీశాడంటే సుమోలు లేవాల్సిందే నని అందరూ అనుకుంటారు.
ఇక అదే విషయంపై స్పందించిన ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి బాలయ్య సినిమాల గురించి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని తెలుస్తుంది.
ఇక పోతే సినిమాల్లో సుమోలు ఎగిరే సీన్లు పెట్టడానికి ముఖ్య కారణం ఆ సినిమా కథ అని దర్శకుడు గోపాల్ చెప్పారని తెలుస్తుంది. ఇంకో ముఖ్య కారణం విజయేంద్ర ప్రసాద్ అన్న అని ఆయన ఆ సన్నివేశం అంత పాఫులర్ అవుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారని సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అనేదే ఒక అబద్దం అని  ఆ అబద్దాన్ని నమ్మేటట్టు చేయడం సినిమా అని ఎవరో చెప్పగా తాను విన్నట్టు గుర్తు అని ఆయన చెప్పుకొచ్చారని తెలుస్తుంది. తన ఉద్దేశం ప్రకారం సినిమా అంటే ఆ హీరో ఉన్నాడు కాబట్టి ఫైట్ కచ్చితంగా పెట్టాలనే రూల్ తాను ఎప్పుడూ పాటించనని ఆయన అన్నారని తెలుస్తుంది.
తన సినిమాల్లో హీరో కొడుతుంటే ఇంకా కొట్టు అనే విధంగా ప్రేక్షకులు ఫీల్ కావాలి కానీ  ఫైట్ వచ్చింది అలా వెళ్లిపోదామనుకునే సందేహం రాకుండా తాను ఎప్పుడూ చూసుకుంటానని ఆయన వివరించారని సమాచారం. కాబట్టి ఆ సందర్భంలో ఫైట్ అవసరం అనుకుంటే తప్ప అలాంటి సీన్ల జోలికి తాను పోనని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా సమరసింహారెడ్డిలో అలా సుమోలు లేపినపుడు తమని ఎవరూ తిట్టలేదని దానికి అభిమానులు చాలా బాగా కనెక్ట్‌ అయ్యి బాగా థ్రిల్ అయ్యారని గోపాల్ చెప్పారని తెలుస్తుంది.ఆ సినిమాలో బాలయ్య కుటుంబాన్నంతటినీ చంపేస్తే ఆయన విలన్ల మీదకు గొడ్డలి తీసుకెళ్లి ఫైట్ చేయడం అలాగే దానికి తోడు వెనకాలే సుమోలు లేవడం అనేది బాగా సెట్ అయిందని ఆయన అన్నారు. ఇప్పటికీ కూడా ఆ సీన్ చూస్తే చాలా బాగుంటుందని ఆయన అనందం వ్యక్తం చేశారని తెలుస్తుంది.
ఆ తర్వాత తీసిన నరసింహా నాయుడు సినిమాలో ట్రైన్ వెళ్తా ఉంటే హీరోయిన్ అన్నయ్యలు ఫాలో అయ్యే సీన్ చాలా హిట్ అయిందని ఆ రోజుల్లోఅలా చేజ్ చేసే సన్నివేశం నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ అని, దానికి తమకు చాలా మంచి పేరు వచ్చిందని డైరెక్టర్ గోపాల్ తెలిపారని తెలుస్తుంది. నిజానికి ఆ సీన్ చూస్తున్నపుడు అక్కడ పెద్ద ఫైట్ ఉంటుందేమో అనుకుంటారని కానీ బాలకృష్ణ రైలులోనుంచి దిగి నడుచుకుంటూ వస్తుంటే విలన్లు ఒక్కో అడుగు వెనక్కి వేస్తుండే సీన్‌ను చూసి జనాలు చాలా థ్రిల్ అయ్యారని ఆయన అన్నారని సమాచారం.
ఇక సెకండ్ ఆఫ్‌లో బాలకృష్ణ వాళ్ల కుటుంబ సభ్యులను రైలు ఎక్కిస్తూ ఉన్నపుడు ఆయన వెనక నుంచి విలన్లు గొడ్డలి విసరాగానే అది ఆయన వెనక తాకే సీన్‌ చూసి థియేటర్‌లో సినిమా చూస్తున్న డైరెక్టర్లు మరియు రైటర్లు తనకు ఫోన్ చేసి ఇదేం సీన్ అండి బాబు ఇంత అద్భుతంగా ఉంది. మా రోమాలు నిక్కపొడుచుకున్నాయని అన్నట్టు ఆయన గర్వంగా చెప్పుకున్నారని సమాచారం. అక్కడ సుమోలు లేవడానికి విజయేంద్ర ప్రసాద్ కారణమైతే, ఇక్కడ జీపులు లేవడానికి కారణం మా చిన్ని కృష్ణ అని ఆయన వివరించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: