ఒక్క హిట్ కే అంత టెక్కా... కుర్ర హీరోయిన్ పై గుర్రుగా నిర్మాతలు?

VAMSI
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఫాషన్ తో వచ్చి నటులుగా కొనసాగుతున్నారు. వారిలో సినిమా నేపథ్యం ఉన్నవాళ్లు ఉన్నారు. అలాగే ఎటువంటి సినిమా నేపథ్యం లేనివారు కూడా ఉన్నారు. అయితే అందరికీ హిట్ లు వెంటనే రావు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇండస్ట్రీలో మనము ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని హిట్ లు వచ్చినా ఏదో సాధించాము అనే ఫీలింగ్ ఉండకూడదు. ఎప్పుడైనా మన మానసిక స్థితిని నియంత్రణలోనే ఉంచుకోవాలి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక హీరోయిన్ వ్యవహారం అందరినీ షాక్ కు గురి చేస్తోంది అని చిత్ర పురిలో గుసగుసలు వినపడుతున్నాయి. ఆ విషయం ఏమిటో ఒకసారి చూద్దాం.
ఈ మధ్యనే టాలీవుడ్ కి వచ్చిన ఒక యువ హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. అయితే అది మరీ పెద్ద హిట్ కాకపోయినా మంచి ఓపెనింగ్స్ లభించాయి. అయితే అంత దానికే సదరు హీరోయిన్ బాగా టెక్ చూపిస్తోంది అని తెలుస్తోంది. ఇక్కడ అందరికీ విజయం అపజయం అనేది సాధారణం. కానీ ఒక్క హిట్ కే అంతలా విజయ గర్వం తలకు ఎక్కించుకుంటే కష్టమే అని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఇంతకు ముందు మొదటి సినిమా చేస్తున్నప్పుడు మాత్రం నిర్మాత కల్పించిన అన్ని ఏర్పాట్లకు కిక్కురుమనకుండా ఉన్న ఆ యువ నటి రెండవ సినిమా నుండి తనకు స్పెషల్ ఏర్పాట్లు కావాలని డిమాండ్ లు పెడుతోందట.
నాకు నచ్చిన హోటల్ లోనే రూం పెట్టాలి, కోరిన హోటల్ మాత్రమే ఫుడ్ కావాలి అంటూ గొంతెమ్మ కోర్కెలు కోరుతోందని ఆ నిర్మాత విసుగు చెందారు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్లాప్ అయితే ఈ హీరోయిన్ ను ఎవ్వరూ పట్టించుకోరు. మరి ఇంత టెక్ అవసరమా? రెండవ సినిమాకే ఇలా మారిపోతే ఎలా అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి ముందు ముందు అయినా ఈమె మారుతుందా లేదా అన్నది తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: