సర్కారు వారి పాట నుండి ఏకంగా రెండు అప్ డేట్స్ ... ?

GVK Writings
టాలీవుడ్ క్రేజీ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట పై అందరిలో ఎంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి మహేష్ కెరీర్ కి మరొక బ్లాక్ బస్టర్ నివ్వడం ఖాయం అని బలంగా నమ్మకాలు పెట్టుకున్నారు .దానికి కారణం తొలిసారిగా సూపర్ స్టార్ తో పరశురామ్ ఈ సినిమా తీస్తుండడంతో పాటు ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ కావడం, అలానే చాలా గ్యాప్ తరువాత మహేష్ బాబు మూవీకి థమన్ సంగీతం అందించడంతో పాటు మరీ ముఖ్యంగా మహేష్ ఇందులో ఎన్నో ఏళ్ల విరామం అంతరం ఫుల్ గా క్రాఫ్ పెంచి స్టైలిష్ ట్రెండీ లుక్ లో కనపడుతుండడం వంటివి.
ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పోస్టర్స్ అన్ని కూడా సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు పరశురామ్ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తీస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, కేవలం సాంగ్ మాత్రమే కాక, ఇందులో విలన్ గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా పండుగ రోజున విడుదల చేసేలా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం .మరి ఇదే కనుక నిజం అయితే సంబరాల దీపావళి పండుగ నాడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఏకంగా డబుల్ ఫీస్ట్ ఖాయం అనే చెప్పాలి. కాగా ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు ఆర్ధిక నేరాల నేపథ్యంలో సాగనుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: