చిరంజీవి సినిమాకు 35ఏళ్ళు...!

murali krishna
చిరంజీవి మరియు భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించిన చిత్రం విజేత. అప్పటి అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించారని అందరికి తెలుసు.
హిందీలో వచ్చిన సాహెబ్‌ సినిమాకి ఇది రీమేక్ సినిమా అని చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు.. 1985 అక్టోబరు 23న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టి అప్పటి రికార్డులు తిరగ రాసింది నేటితో ఈ సినిమాకి 35 ఏళ్ళు నిండాయని సమాచారం.
అప్పటివరకూ మాస్ కథలనే చేసుకుంటూ వెళ్తున్న చిరంజీవికి విజేత ఫ్రెష్ లుక్ ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.. చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసిన చిత్రం ఇదేనని చెప్పటానికి అతిశయోక్తి కాదు. ముందుగా ఈ సినిమాకి చిన్నబాబు అనే టైటిల్ అనుకున్నారని తెలుస్తుంది.. అయితే కథకి తగ్గట్టుగా టైటిల్ ఉండాలని చిరంజీవి సూచించడంతో ఆ తర్వాత విజేతగా మార్చారని సమాచారం.. చిరంజీవి నటించిన టాప్ టెన్ చిత్రాలలో తప్పకుండా చోటు దక్కించుకోదగ్గ చిత్రం ఏదైనా ఉందంటే అది విజేత అనే చెప్పవచ్చు...
ఈ సినిమాకు జంధ్యాల మాటలు రాయగా అప్పటి టాప్ సంగీత దర్శకుడు అయిన చక్రవర్తి సంగీతం అందించారని తెలుస్తుంది.. ఈ సినిమాలో ఇప్పటి స్టార్ హీరో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని సమాచారం.అల్లు అర్జున్ కి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అల్లు అర్జున్ తో పాటుగా ఆయన అన్నయ్య బాబీ కూడా ఈ సినిమాలో నటించాడని తెలుస్తుంది.. ఈ సినిమాకి రెండోసారి నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడట చిరంజీవి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే  ఇదే సినిమా పేరుతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడని అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాతో నటుడుగా కళ్యాణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: