విచారణకు లేటుగా హాజరైనందుకు అధికారులు సీరియస్..

Purushottham Vinay
ఇక ముంబై క్రూయిజ్ డ్రగ్స్ ఎపిసోడ్ కు సంబంధించిన ఇప్పటికే పెను సంచలన అంశాలు చోటు చేసుకోవటం అనేది తెలిసిందే. ఇక ఈ ఘటనలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో సహా పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకోని ఇక వారిని రిమాండ్ చేయటం.. ఇక ఇప్పటికి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికి కోర్టు నుంచి వారికి ఎలాంటి సానుకూల స్పందన అనేది రాకపోవటం తెలిసిన విషయమే. ఇక ఇదిలా ఉంటే.. ఆర్యన్ సెల్ ఫోన్ ను టెస్ట్ చేసిన క్రమంలో.. నటి అనన్య పాండేతో కూడా జరిగిన వాట్సాప్ చాట్ వెల్లడవ్వడం అనేది జరిగింది. ఇక ఇందులో డ్రగ్స్ కు సంబంధించిన అనేక వివరాలు ఉండటంతో ఆమెను ఎన్ సీబీ అధికారులు విచారణకు రావాలని డిమాండ్ చెయ్యటం జరిగింది.విచారణకు హాజరు కావాలని అనన్యకి సమన్లు జారీ చేశారు. దీంతో గురువారం ఆమె విచారణకు హాజరవ్వడం అనేది జరిగింది.ఇక రెండు గంటల పాటు విచారణ తరువాత .. శుక్రవారం ఉదయం 11 గంటలకు మరోసారి రావాలని ఆమెకి చెప్పారు.

ఇక అధికారుల ఆదేశాలకు భిన్నంగా అనన్య పాండే మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండు గంటల సమయానికి విచారణకు హాజరవ్వడం జరిగింది.ఇక దీంతో.. విచారణ అధికారులు అనన్యపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదేమి సినిమా షూటింగ్ ఇంకా ప్రొడక్షన్ హౌజ్ ఏమి కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయమని ఖచ్చితంగా సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పినట్లుగా తెలిసిందే. శుక్రవారం నాడు దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన అధికారులు ఇక ఆర్యన్ ఖాన్ తో జరిపిన చాటింగ్ గురించి ప్రశ్నించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక తాను డ్రగ్స్ ను ఎప్పుడూ తీసుకోలేదని అలాగే మాదకద్రవ్యాల్ని కూడా ఎప్పుడూ తీసుకోలేదని.. ఇక అంతేగాక ఎవరికి కూడా సరఫరా చేయలేదని చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇక విచారణకు అనన్య ఆలస్యంగా రావటంతో ఆమెను అధికారులు గట్టిగా మందలించినట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు ఈ ఉదంతం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: