బుచ్చిబాబు.. కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా!!

P.Nishanth Kumar
తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు. ఇది ఓ అగ్ర దర్శకుడు పుట్ట బోతున్నాడు అని చెప్పడానికి సూచన అని చెప్పవచ్చు. అలా తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించే సినిమా చేసి ఇప్పటివరకు ఎంతోమంది అగ్ర దర్శకులు గా ఎదిగారు.  అలా ఉప్పెన సినిమాతో తొలిసారిగా మెగా ఫోన్ చేత పట్టుకుని ఆ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి భారీ వసూళ్ల తో పాటు ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

ఈ సినిమా ఈ స్థాయిలో సూపర్ హిట్ కావడానికి ముఖ్య కారణం ఆయన ప్రతిభ అని చెప్పవచ్చు. కమిట్ మెంట్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అయింది. సినిమా కథకు తగ్గ డైరెక్షన్ చేసి దానికి తగ్గ నటీనటులను ఎంపిక చేసుకొని సాంకేతిక నిపుణుల ఎంపిక చేసుకొని ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవడానికి ఆయన ముఖ్య కారణం అయ్యాడు.  సుకుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసి మంచి అనుభవాన్ని గడించాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటి వరకు వచ్చి ఇప్పుడు ఉప్పెన సినిమా చేశాడు.  

అలా తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన రెండవ సినిమాను పెద్ద హీరోతో చేయాలని ప్రయత్నాలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆయన ప్రయత్నాలు చేయగా ఎన్టీఆర్ దొరక్కపోవడంతో మళ్లీ ఉప్పెన లాంటి మరో సినిమా చేయాలని భావించాడు. అయితే ఉప్పెన రేంజ్ లో ఎందుకు ఉప్పెన 2 సినిమానే తెరకెక్కిస్తే మంచిదని దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయంపై ఇటీవలే ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని బుచ్చిబాబు చెప్పి దానికి కథ రాసుకుంటూ ఉన్నట్లుగా వివరణ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఉప్పెన సినిమా కి మించిన రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: