మలైకా అర్జున్ కపూర్ ఫోటోకి నెటిజెన్ దిమ్మతిరిగే కామెంట్..

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు భార్య మలైకా అరోరా బాలీవుడ్ యువహీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి ఇద్దరి మధ్య వయసు వత్యాసం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతుంది. కానీ దానిని ఈ జంట అసలు ఎప్పుడు కూడా పట్టించుకోదు. అలాగే ఎన్నో విమర్శలు ఎదురైనా కాని అసలు వాటికి స్పందించరు. ఈ విమర్శల్ని ఎంత మాత్రం పట్టించుకోకుండా  తమ కెరీర్ పైనే దృష్టి సారించి ముందుకు సాగిపోతున్నారు.ఇక ఈ జంట మధ్య ప్రేమని చూసి కొంత మంది విమర్శకులు ప్రశంసకులుగా మారిపోయారంటే వీరి ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇక వీరు ఇద్దరు కూడా ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు.. చరిత్రలో ముంతాజ్ షాజాహాన్ జంటలా మరో ప్రేమ చరిత్ర ఉంటుందంటూ అదే విమర్శకుల ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా విమర్శలు ఇంకా ప్రశంసల నడుమ మలైకా అరోరా - అర్జున్ కపూర్ ప్రేమాయణం సాఫీగా సాగిపోతోంది.

ఇక తాజాగా మరోసారి వీరు ఇద్దరు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోలో ప్రేమికుని చెంత సఖి ఇలా  కూర్చోని మధురమైన ద్రవాల్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఓ చల్లని సాయంత్రం వేళ ఈ జంట ఇలాగా సేద తీరుతున్నారు. అయితే మలైకా చేతిలో ఉన్నది ఆల్కహాల్ గ్లాస్ అంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రియుడి నుదిటిన ముద్దాడుతూ తననే చూస్తున్న ప్రేమికురాలిగా మలైకా ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఇక అలా సన్నగా చిన్నగా చిరు నవ్వు నవ్వుతూ ప్రియురాలి ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాడు అర్జున్. అయితే ఈ ఫోటో చూసిన నెటిజనులు వాట్ ఏ క్యూట్ ఫెయిర్ అంటూ కామెంట్లు చేయగా.. ఓ ఫాలోవర్ మాత్రం వీరు ఇద్దరు తల్లీకొడుకుల్లా ఉన్నారంటూ షాకింగ్ కామెంట్ చేసాడు.ప్రస్తుతం ఈ కామెంట్ తెగ వైరల్ అవుతుంది. చాలా మంది కూడా ఏంది బ్రో అంత మాటన్నావ్ అని అతనికి ఫన్నీగా రిప్లై లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: