ప్రభాస్ కు రొమాంటిక్ సీన్ చేయాలంటే భయమా... ఇదిగో సాక్ష్యం?

VAMSI
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తమ అభిమానతార బాహుబలి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రభాస్ అలవాట్లు, అభిరుచులు, నడవడిక, డైలీ లైఫ్ ఇలా ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే డార్లింగ్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇపుడు తెలుసుకుందాం. అయితే తన కెరీర్ మొదటి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ కెమెరా ముందే కాదు...ఆఫ్ ద కెమెరా కూడా మిస్టర్ పర్ఫెక్టే. అమ్మాయిలు అంటే చాలు ఈ హీరో ఆమడ దూరం జరుగుతారు. ఇక మూవీస్ లో రొమాంటిక్ సీన్ లు చేయడానికి చాలా మొహమాట పడుతుంటారట ప్రభాస్. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మేనేజర్ కమిడియన్ ప్రభాస్ శ్రీనునే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అడవి రాముడు సినిమా చేసే సమయంలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ను ముద్దు పెట్టుకునే సీన్ చేయడానికి తెగ కంగారు పడిపోయారట. అంతేకాదు ఇంటికి ఫోన్ చేసి మరీ తన తండ్రి సూర్యనారాయణ రాజుకు ఆ విషయం చెప్పి ఆ సీన్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు  ప్రభాస్ మేనేజర్.
అయితే అప్పట్లో చాలా వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ మొహమాటం గల హీరోనే పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగాడు. ఇప్పుడు అమ్మాయిలు ఇతనంటే పది చస్తారు అంటే నమ్మండి. ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ తో ఆడిపాడే ప్రభాస్ కెమెరా ఆఫ్ అవ్వగానే దూరంగా వెళ్ళిపోతారట. ఏ హీరోయిన్ తో కాస్తో కూస్తో చనువుగా ఉన్నాడు అంటే అది అనుష్కతో మాత్రమే నని ఇండస్ట్రీ లో అంటుంటారు. కెరియర్ మొదట్లో అనుకుంటే ఇంత ఎక్స్పీరియన్స్ తరవాత కూడా అలానే ఉన్నారట ఈ హీరో. ఇది నిజంగా ఆయన గొప్ప వ్యక్తిత్వానికి ఒక నిదర్శనమని చెప్పొచ్చు. ప్రభాస్ ఖాళీ టైం దొరికిందంటే చాలు తన సొంత గ్రామానికి వెళ్ళిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: