ప్రభాస్ అందుకే రెబల్ స్టార్ అయ్యారు?

VAMSI
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఏ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అందుకు మెయిన్ రీజన్ ఈ సాలిడ్ హీరోకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటమే. టాలీవుడ్ సరిహద్దులను దాటి బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ లో కూడా డార్లింగ్ ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతటి క్రేజ్ కీర్తి.. ప్రతిష్టలు, పొందటానికి ప్రభాస్ టాలెంట్ ఏ కారణమయినా అందుకు బీజం మాత్రం ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు వేసారన్నది అక్షర సత్యం. వాస్తవానికి ప్రభాస్ కి మొదట్లో సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదట బిజినెస్ లో ఎదగాలని ఆయన అనుకున్నారట కానీ పెదనాన్న చెప్పటంతో ఇండస్ట్రీ వైపు అడుగు వేశారట ప్రభాస్. అలా ఈ నట వజ్రం మనకు లభించడానికి కారణం నటుడు కృష్ణం రాజు గారే.
ప్రభాస్ కి తన కుటుంబం అంటే పంచప్రాణాలు అందులోనూ తండ్రి అన్నా అలాగే పెదనాన్నా మాట అన్నా వేదవాక్కులా భావిస్తారట మన మిస్టర్ పర్ఫెక్ట్. అందుకే పెదనాన్న మాట కాదనలేక ఇండస్ట్రీ వైపు మరలారు. అదే విధంగా కృష్ణం రాజు కూడా ప్రభాస్ సొంత కొడుకు లాగే చూసుకుంటారు, వీరి మధ్య అంతటి అనుబంధం ఉంది. తన కెరీర్ కి సంబందించిన ప్రతి విషయాన్ని తన తండ్రితో పాటు కృష్ణం రాజు కూడా చెప్పి డెసిషన్ తీసుకుంటారట ప్రభాస్. ఈ హీరో పెదనాన్నను పెద్ద బాజీ అని పెద్దమ్మని కన్నమ్మ అని ప్రేమగా పిలుస్తారట. తన ఫోన్ లో కృష్ణంరాజు కాంటాక్ట్ నంబర్ కి పెద్ద  బాజి అనే సేవ్ చేసుకున్నారట.  
ప్రభాస్ కి తన పెద నాన్న కృష్ణంరాజు అంటే ఎంత ఇష్టం అంటే...తను నేడు ఈ స్థాయిలో ఉన్నాడన్నా, తనకు ఇంతటి ప్రతిభ వంటపట్టింది అన్నా అంతా మా పెదనాన్న పుణ్యమే అని, మా ఫ్యామిలీ మొత్తానికి ఆయనే ఇన్స్పిరేషన్ అంటూ చాలా సార్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ రాదే శ్యాం చిత్రంలో కలిసి వెండి తెరపై కనిపించనున్న విషయం తెలిసిందే. తన పెదనాన్న మూలముగా స్టార్ అయ్యారు. అలాగే తన పెదనాన్న బిరుదును తన సొంతం చేసుకుని ఇప్పుడు అందరికి చేత రెబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: