బాలయ్య హీరోయిన్ ఆశలన్నీ అక్కడేనా...?

Satya
బాలయ్యకి ఒక సెంటిమెంట్ ఉందని టాలీవుడ్ టాక్. ఆయనతో ఒక సినిమాలో నటించి సక్సెస్ అయితే మాత్రం ఆ హీరోయిన్ని ఆయన రిపీట్ చేస్తారు అని అంటారు. అలా చాలా మంది హీరోయిన్స్ కి చాన్సులు ఇచ్చారు. ఇక ఒక బాలీవుడ్ భామ కూడా అదే వరసలో ఏకంగా బాలయ్యతో మూడు సినిమాలు చేసింది.
ఆమె ఎవరో కాదు, తెలుగులో రాంబో అంటూ ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్. ఈ ముద్దు గుమ్మ తొలి సినిమా ఫట్ అయినా కూడా బాలయ్య లెజెండ్ లో చాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తరువాత ఆమె బాలయ్య డిక్టేటర్, రూలర్ మూవీస్ లో కూడా నటించింది. ఇందులో డిక్టేటర్ ఏవరేజ్ గా ఆడితే రూలర్ ఆశించిన విజయం సాధించలేదు. ఈ మధ్యలో ఆమె హీరో పోతినేని రామ్ తో చేసిన పండుగ చేస్కో మూవీ సూపర్ హిట్ అయింది. అయినా తెలుగులో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఇక చాలా కాలం తరువాత ఆమెకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అంటే ఎఫ్ త్రీ మూవీలో ఒక గ్లామర్ రోల్ కోసం సోనాల్ చౌహాన్ ని సెలెక్ట్ చేశారు. ఈ మూవీ ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఎఫ్ 2 కి సీక్వెల్. దాంతో కచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ దెబ్బతో టాలీవుడ్ లో సోనాల్ చౌహాన్ దశ తిరిగినట్లే అంటున్నారు. అందంతో పాటు గ్లామర్ ని ఎలా చూపించాలో బాగా తెలిసిన సోనాల్ చౌహాన్ మళ్లీ తన సత్తా చాటితే మాత్రం టాలీవుడ్ లో ఆమె ప్లేస్ కి ఢోకా ఉండదని అంటున్నారు.  మరి ఈ మూవీ తరువాత మళ్లీ బాలయ్యతో సోనాల్ నటిస్తుందా. ఇతర స్టార్ హీరోలతో కనిపిస్తుందా అంటే వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: