ఒక్కసారిగా చిరంజీవి అరవడంతో.. భయమేసిందంటున్న అన్నపూర్ణ..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 700కు పైగా సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు పొందిన నటి అన్నపూర్ణ. అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారిలో అన్నపూర్ణమ్మ కూడా ఒకరు. ఇక ఇప్పుడు దాదాపుగా 73 సంవత్సరాల వయసులో కూడా తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంది. అయితే ఒకసారి ఈమెను చిరంజీవి అరవడంతో భయపడిందట.. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.

తాజాగా అన్నపూర్ణమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి బాబా అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. తాను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎవరూ బాధపడలేదు అని చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ. కేవలం తన భర్త ఒక్కరే బాధ పడి ఉంటారని తెలిపింది.. అన్నపూర్ణమ్మకు సామాన్యంగా ఏడుపు రాదని.. సినిమాలలో యాక్టింగ్ పరంగా వరకు నేను మెత్తగా కనిపిస్తాను.. రియల్ లైఫ్ లో ఆలా ఉండనంటూ తెలిపింది. ఇక ఇప్పుడు ఎక్కువగా వయసు అయిపోయింది కాబట్టి బుర్ర పెద్దగా పని చేయలేదని కూడా చెప్పుకొచ్చింది.

ఎవరి మీద అయినా ఏమైనా అరిచినా తర్వాత నేనే బాధ పడతానంటూ తెలుపుతోంది అన్నపూర్ణ. కేవలం మనం పని చేస్తే మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పుకొస్తోంది. అలా ఎక్కువగా నేను సురేష్ ప్రొడక్షన్ లోనే బాగా ఆఫర్లు రావడం చేత డబ్బు సంపాదించాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో తమ బంధువులు చాలా మంది ఉన్నారని చెప్పుకొస్తోంది.
అందులో చంద్రమోహన్, సత్యనారాయణ మరికొందరు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా తమ మనవళ్లు కూడా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి.. ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కరెంటు వైరు ఉండడం చేత..నన్ను చిరంజీవి చూసుకొని వెళ్ళు అంటూ గట్టిగా అరవడం జరిగిందని చెప్పుకొచ్చింది. అలా చిరంజీవి తన బాగు కోసమే ఆరిచాడని తెలిపింది.ఇక బాలకృష్ణ కు కూడా నేనంటే చాలా ఇష్టం అని తెలిపింది అన్నపూర్ణమ్మ. సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోని ఒక్కో పేరుతో పిలుస్తారు అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: